సేవా జయ సూర్యుడు

సేవా.. ఆధ్యాత్మిక కార్యక్రమాలే పరమావధిగా ముందుకు వెళ్తున్న యువకుడు జీవితగాధ.

ఆధ్యాత్మికం పట్ల ఆర్తి.. అవధులు లేని అభిమానం.. పరుల పట్ల ప్రేమ.. నిస్వార్థ సేవ, సముద్రమంజెట్ సహనం. సహృదయం.. ఇవన్నీ కలగలిపితే జయ సూర్యడు. మన మధ్య సాధారణంగా తిరుగాడే సాధారణ మనిషే. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికం… సేవాగుణం.. సమాజ హితం… పైసా ఆశించని పరోపకారం… అతన్ని పురుషోత్తముడిగా కీర్తింపబడుతున్నాడు. అందుగలడని అందులేడని సందేహం వలయదు.. సేవా కార్యక్రమాల్లో ఎందెందు వెదకిచూసినా.. ఈ జయసూర్యనారాయణ అందందు తప్పక కనిపిస్తాడు. చిరు ప్రాయం. అంటే ఐదేళ్ల వయస్సు నుండే సేవా కార్యక్రమాలుపై మక్కువ ఏర్పరుచుకుని.. ఆధ్యాత్మికాన్ని అలవాలంగా చేసుకున్నాడు. రెండు దశాబ్దాలు పాటు నిరంతరాయంగా పరులకు సేవలందించిన సేవా సముద్రుడుగా పేరు సంపాదించుకుంటున్నాడు. నోటితో చెప్పేందుకు ఒకటా.. రెండా.. రెండు రాష్ట్రాల్లో వందలాది ఆధ్మాత్మిక.. సేవా కార్యక్రమాలను చేపట్టి సమాజ హితుడిగా.. సేవాభిలాషిగా అందరి మదిలో పదిలమైన స్థానం ఏర్పరుచుకున్నాడు.. ఈ జయ సూర్యడు…

పుట్టింది సాధారణ మధ్యతరగతి కుటుంబం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామం. ఆసిరితాత, రాములమ్మల ముదబిడ్డగా జన్మించిన పాగోటి సూర్యనారాయణ, ఎంతో కాలంగా ఆయన చేపట్టిన ఆధ్యాత్మిక.. సేవాకార్యమాలు ద్వారా ఎంతో మందికి సుపరిచితుడిగా మారిపోయాడు. ఆయన చేయనటువంటి సేవా కార్యక్రమం లేదు. ఆయన, హజరు ప్రమేయం.. సహాయం లేని ఆధ్యాత్మిక కార్యక్రమం అంటూ ఉండవు. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్య క్రమం, సేవాకార్యక్రమం జరిగినా పిలవని పేరంటంలా హజరైపాయి, అందిరిలో కలసిపాయి కార్యక్రమం విజయవంతం చేసే మంచిగుణం ఆయనకు అలవడిపోయింది. విధమైన మంచితనంతోనే అందరికి సన్నిహితుడిగా మారిపోయాడు.

పుష్కరాల్లో అన్నదాన సేవలకు పురస్కారం

సుమారు 2 నెలలు ఊరూరా తిరిగి సేవకరించిన విరాళాలులో పరమ పవిత్రమైన గోదావరి క్రిష్ణానది పుష్కరాల్లో అన్నదానం నిర్వహించిన మహాబాగ్యం జయసూర్యనారాయణకే దక్కింది. ఊరుమీద సేకరించిన సొమ్ము సగం రోజులకే సరిపడగా.. అన్నదానం మద్యలో వదిలేసి రాలేశ.. తాను అప్పుచేసి మరీ పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నం పెట్టిన ఉదార గుణం ఆయన సొంతం. ఈ పుష్కరాల్లోనే శ్రీ జయసూర్య సేవాసంఘం సేవలకు గాను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సేవారత్న పురస్కారా న్ని కూడా అందజేస్తారు. ఇంకా మిగిలిన ‘బియ్యాన్ని రాజమండ్రిలోని అనాథ ఆశ్రమా లకు పంచిపెట్టారు.

సేవాకార్యక్రమాలే ఊపిరిగా…

ఐదేళ్ల ప్రాయం నుంచే పరులకు సాయపడాలనే గ్రామంలో జరిగే అన్ని ఆధ్యాత్మక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరినోటా సేవా మార్యనారాయణగా పిలవబడ్డారు. ఇక్కడి నుండి 2002లో శ్రీజయ సూర్యనారాయణ సేవా సంఘం అనే సేవా సంఘాన్ని స్థాపించి తద్వారా అనేక సేవా కార్యక్రమాను చేపట్టారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిం చడం అధ్మాత్మిక జాతర్లలో మంచినీళ్లు, మజ్జిక పంపిణీ, పులిహోరా ప్రసాదాలకు ఉచితంగా పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేప ట్టారు. అంతే కాకుండా పోటీ పరీక్షలకు హజరయ్యే నిరుద్యోగులకు సొంత వాహనంతో ఉచితంగా పరీక్షా సెంటరుకు చేర్చడం, నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, విద్యార్థులకు టెబెంట్ పరీక్షలు నిర్వహించి వారికి ప్రోత్సహించేవిధంగా నోట్ బుక్స్, అట్టలు, పెన్, పెన్సిల్స్ ఉచితంగా బహుమతులు అందజేసారు. అలాగే విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు.. ఆత్మహత్యల నివారించి వారిలో ఆత్మస్థైర్యం నింపేవిధంగా ప్రముఖ ప్రవచన కర్తలచే ఉపన్యాస కార్య క్రమాలు నిర్వహింపజేసారు. కాకుండా ఎంతోమంది కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాలకు ఉచితంగా సొంత ఖర్చులు పెట్టి తీసుకువెళ్లిన ఘనత కూడా ఆయనదే. అలాగే 18 శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొనే తరించే భాగ్యం కూడా ఆయన దక్కించు కున్నారు. పలు దేవస్థానాల నిర్వాహకులుగా కూడా ఆయన ఉన్నాడు. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీ విశ్వ విరాట్ వీర హనుమాన్ విగ్రహం నిర్మాణంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. సిమ్మెంట్, తన వంతు విరాళం, సహాకారం అందించారు. అలాగే ఎంతో మందికి ఉచితంగా డ్రైవింగ్ కూడా నేర్పించారు.

అన్నార్తులకు ఆసరాగా ఫుడ్ బ్యాంకు

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటుచేసిన శ్రీజయసూర్య పుష్బ్యాంకు అందరి మన్ననలు పొందుతుంది. శుభ, అశుభ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను బోయకుండా.. వాటిని నీరు పేడల వాడల్లో పంపిణీ చేసే బృహత్తరమైన కార్యక్రమం ఈ జయసూర్య పుడ్ బ్యాంక్, గత ఐదేళ్లుగా సమర్ధవంతంగా జయసూర్య ఫుడ్ బ్యాంక్ శ్రీజయ సూర్య ఆధ్యర్యంలో నిర్వహింప బడుతుంది. సొంత ఖర్చులు, ప్రయాసతో ముందుకు సాగుతున్న ఈ బ్యాంకుకి ఆహార పదార్థాలు నిల్వచేసే ఫుడ్ ఫ్రీట్ స్టేండ్లు ఏర్పాటు చేస్తే మరింత దోహదపడతాని ఆకాంక్షిస్తున్నారు. దాఠలు కోసం ఎదురుచూస్తు న్నారు.

వివాహ వేదిక నిర్వాహణ:

ఇన్ని సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలుతో పాటు ఎంతో మందిని జర కలిపే వివాహ వేదిక మ్యారేజ్ బ్యూరోని కూడా నిర్వహిస్తున్నారు. నామమాత్రపు రూసము తీసుకుని ఎంతో మందికి పెళ్లిళ్లు జరుపుతున్నారు. 2019 లో శ్రీ జయసూర్య మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించారు. తొలినాళ్లలో సుమారు 50 పెళ్లిళ్లు ఉచితంగా చేయించిన ఘనత కూడా జయపర్మనారాయణుడే. అలా నిర్వాహణ భారంగా మారడంతో ఖర్చులకు నామమాత్రపు రుసు ము తీసుకుని ప్రస్తుతం శ్రీజయ సూర్య మ్యారేజ్ బ్యూరోని నిర్వహిస్తు న్నారు.. అయినప్పటికీ నామ మాత్రపు రూపుము కూడా ఎగ్గొట్టే బాపతులు ఎందరో ఉన్నారు. ప్రధానంగా నెలమ సామాజిక వర్గంకు చెందిన వివాహాలు ఎక్కువ కుదుర్చుతూ ఎంతో మంది ఇంటలను కలుపుతున్నాడు. కాని ఆయన వ్యక్తిగత విషయానికి పచ్చేసరికి మాత్రం విభిన్నం. ఆయన ఇంకా బ్రహ్మచారి జీవితాన్నే గడుపుతున్నారు. అన్ని వైదిక కట్టుబాట్లు ఉన్న అర్ధాంగి తన జీవితంలోని రావాలని కోరుకుంటున్నాడు. తెలుగు సినిమా సూర్యవంశం లోని మీనా క్యారెకలా తన జీవిత భాగస్వామి ఉండాలని సరదాగా ఓమాట అలా చెబుతుంటారు. వేచిచూద్దాం.. ఎక్కడో ఒక దగ్గర నాకోసం పుట్టే ఉంటుంది అంటూ సరదాగా చెబుతున్నారు.

పుణ్యక్షేత్రాల మట్టి సేకరణ

అందరి రాజధాని అమరావతి కోసం జిల్లాలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుండి పుణ్య నదులు నుండి మట్టి నీళ్లు సేకరిం చడంలో మన జయ సూర్యనారాయన ప్రముఖ పాత్ర వహించారు. అలాగే గ్రామాల్లో వేల మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి.. స్వయంగా నాటించి సంరక్షణ బాధ్యతలు చేపట్టి మొక్కల పర్యా పరణ పరిరక్షణలో తనదైన పాత్ర పోషించారు.

గొలిపే దీపారాధనకు శ్రీకారం చుడుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను చుట్టేస్తుంటాడు. మన జయ సూర్యడు. శ్రీశైలం మల్లి భార్జునస్వామి ఇంద్రకీలాద్రి కనకదుగా ఆలయం. భద్రాచలం, అరసవెల్లి, శ్రీకూర్మాం, శ్రీముఖలింగం, రావివలస, పాతపట్నం వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ప్రతియేటా లక్షదీపారాధనలు, సహస్ర దీపారాధనలు, 108 ప్రమిదలతో దీపారాధనలు చేస్తుంటారు. దీనికి గ్రామస్తుల నుండి పూర్తి సహాయ, సహకారాలు కూడా అందజేస్తుంటారు. అలాగే ప్రతి ఏడాది వినా యక నవరాత్రుల వేడుకలకు మట్టివిగ్రహాలను పంపిణీ చేయడం జరుగు తుంది. ప్లాస్టప్ ప్యారిస్ వ్యర్థాలుతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిళ్లుతుందనే వదుద్దేశంతోనే మట్టి విగ్రహాలను పంపిణీకి నడుం బిగించారు.

అందరివాడుగా అందరితో కలివిడిగా మంచి మనసున్న వాడిగా.. మానవత్వం మూర్తీభవించిన వాడిగా.. నిండైన దైవభక్తి కలిగిన వాడిగా… అందిలో కలిసిపోతూ.. -కష్టపడుతూ.. ఎన్నో ..ఎన్నో కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఇందరివాడిగా మారిపోయాడు. అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగిపోతున్నాడు.. భగవంతుడు పరిపూర్ణమైన ఆయస్సును… యశస్సును ప్రాసాధించాలని భవంతుని కోరుకుంటూ…

కుటుంబంలో..

తరానికి..

ఒక్కడు..